- అల్లుడికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పరామర్శకు వెళ్లిన మంత్రి
ఖమ్మం, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. సమీప బంధువు ఒకరు(అల్లుడు) దుబాయిలో అనారోగ్యానికి గురి కావడంతో, ఆయన్ని పరామర్శించేందుకు గత నెల 24న ఆయన దుబాయ్ వెళ్లారు. ఆరేడు రోజులుగా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో దుబాయ్ లో కూడా కొన్నిచోట్ల దాడులు జరగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో తుమ్మల దుబాయ్ లో చిక్కుకున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం తుమ్మలకు ఎలాంటి ఇబ్బంది లేదని, మరో మూడు నాలుగు రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారని తుమ్మల సన్నిహితులు చెబుతున్నారు.
