భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఎస్బీఐ యోనో యాప్‌లో సాంకేతిక లోపం ఉందని పేర్కొంటూ సైబర్ నేరగాళ్లు బాధితుడికి ఫోన్ చేశారు.
సమస్య పరిష్కారానికి ఏపీకే ఫైల్ పంపించి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వారి మాటలు నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయగానే, అతని బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.2 లక్షలు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
