సిటీలో స్టైల్.. రొడింగ్ లో పవర్ ! ల్యాండ్ మోటో నుంచి కొత్త ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్.. ఫీచర్లు ఇవే!

సిటీలో స్టైల్.. రొడింగ్ లో  పవర్ ! ల్యాండ్ మోటో నుంచి కొత్త ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్.. ఫీచర్లు ఇవే!

అమెరికన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ  LAND మోటో  ఒక కొత్త పవర్ ఫుల్ బైక్ డిస్ట్రిక్ట్ ADVని ప్రవేశపెట్టింది. ఇదొక  డ్యూయల్-స్పోర్ట్ మోటార్ బైక్, అంటే దీనిని సిటీ రోడ్లపై అలాగే  ఆఫ్-రోడింగ్ కోసం కూడా  నడపవచ్చు. ఈ బైక్ ప్రత్యేకంగా ఆఫ్-రోడింగ్ కోసం  రూపొందించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్  ఫీచర్స్ చూస్తే....... LAND Moto లైట్ వేట్ బైక్‌లకు ప్రసిద్ధి చెందింది. డిస్ట్రిక్ట్ ADV బైక్  కేవలం 109 కిలోల బరువుతో దీనిని నడపడం, మెయిన్ టైన్ చాల ఈజీ.  

ఈ బైక్‌లో కంపెనీ ఎండ్యూరో ఎవల్యూషన్ అనే కొత్త మోటార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసింది. పవర్ అవుట్‌పుట్ పరంగా 345 Nm  టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది...  కఠినమైన భూభాగాలు, ఎతైన పర్వతాలను  ఈజీగా  అధిరోహిస్తుంది. ఈ బైక్ రివర్సింగ్ కోసం రివర్స్ మోడ్‌,  రీజెనరేటివ్ బ్రేకింగ్‌,  బ్రేకింగ్ చేసేటప్పుడు బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.

ఆఫ్-రోడింగ్ కోసం స్పెషల్ ఫీచర్స్ 
 కఠినమైన భూభాగాలపై ఈజీగా ప్రయాణించేందుకు  ఈ బైక్ కి లాంగ్ సస్పెన్షన్‌ ఇచ్చారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 9 అంగుళాలు. స్ట్రాంగ్  వీల్స్, ప్రత్యేకమైన  ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌ ఉన్నాయి. ఇంజిన్/మోటార్‌ని  రాళ్ల నుండి రక్షించడానికి అల్యూమినియం బాష్ గార్డ్ అందించారు. బైక్ స్పీడ్, బ్యాటరీ సమాచారాన్ని చూపించడానికి కలర్ స్క్రీన్ (TFT) ఉంది.

►ALSO READ | ఆస్తులు, అప్పులు.. లెక్కలన్నీ ఇక ఒకేచోట! ఇండియాలోనే మొదటి యాప్..
 
సిటీలో అయితే  ఫుల్  ఛార్జ్ చేస్తే  బ్యాటరీ 177 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఛార్జర్ బైక్‌తోనే వస్తుంది... కాబట్టి మీరు విడిగా భారీ ఛార్జర్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కంపెనీ ఈ బైకుని రెండు వెర్షన్లలో ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ మోడల్ ధర సుమారు  రూ. 10.17 లక్షలు. డెలివరీలు 2026లో ప్రారంభమవుతాయి.

అసెంట్ ఎడిషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా 30 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసిన లిమిటెడ్ ఎడిషన్.   దీని ధర సుమారు  రూ. 11.54 లక్షలు. LAND Moto నుండి వచ్చిన ఈ బైక్ ఆఫీసుకు వెళ్లడానికి, వీకెండ్ అడ్వెంచర్  ట్రిప్స్  ఆస్వాదించడానికి స్టైలిష్ & స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ బైక్‌ను కోరుకునే వారికి ఒక గొప్ప అప్షన్ .