తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయ్యాల ( జనవరి 18 ) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పాలేరులో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ గ్రౌండ్స్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా ఇన్ చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ పాల్గొంటారు. సీఎం రాక సందర్భంగా ఖమ్మం సిటీలో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లీస్తూ రూట్ మ్యాప్ ను విడుదల చేశారు.
