న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఏర్పాటు చేయబోయే కొత్త తయారీ ప్లాంట్ కోసం రూ.35 వేల కోట్లను మారుతి సుజకీ ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయనుంది. ఈ కొత్త ప్లాంట్‌లో ప్రొడక్షన్ 2028–29 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని అంచనా. ప్రస్తుతం మారుతి సుజుకీ ఏడాదికి 24 లక్షల వాహనాలను తయారు చేస్తోంది. కంపెనీ కిందటేడాది డిసెంబర్‌లో దేశీయ డీలర్లకు 1,78,646 యూనిట్లను అమ్మింది. ఇది ఏడాది లెక్కన 37శాతం ఎక్కువ. ఎంట్రీ-లెవల్ మోడళ్లకు సుమారు 45 రోజుల ఆర్డర్ బ్యాక్‌లాగ్ ఉందని కంపెనీ తెలిపింది. ప్లాంట్ కోసం భూమి కొనుగోలుకు బోర్డు రూ.4,960 కోట్ల ప్రారంభ పెట్టుబడిని ఆమోదించింది. కొత్త ప్లాంటుతో భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే కాకుండా, ఎగుమతులనూ పెంచుతారు.
