Daryl Mitchell: కోహ్లీని మించిన నిలకడ: అసాధారణ ఫామ్‌తో విరాట్‌ను వెనక్కి నెట్టిన మిచెల్

Daryl Mitchell: కోహ్లీని మించిన నిలకడ: అసాధారణ ఫామ్‌తో విరాట్‌ను వెనక్కి నెట్టిన మిచెల్

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ వన్డేల్లో టాప్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో పరుగులక వరద పారిస్తున్నాడు. మిచెల్ అసాధారణ నిలకడ ప్రస్తుతం షాకింగ్ కు గురి చేస్తోంది. తొలి వన్డేలో 84 పరుగులు చేసిన మిచెల్.. రెండో వన్డేలో 134 పరుగులతో మ్యాచ్ ను గెలిపించాడు. ఆదివారం (జనవరి 18) ఇండియాతో జరుగుతున్న మూడో వన్దేలోనూ ఈ కివీస్ స్టార్ సెంచరీతో దుమ్ములేపాడు. ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ లో మిచెల్ 131 బంతుల్లో 137 పరుగులు చేశాడు. మిచెల్ ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.   

ఈ క్రమంలో ఈ కివీస్ స్టార్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి వన్డేల్లో అత్యధిక యావరేజ్ కలిగిన ప్లేయర్ గా నిలిచాడు. మూడో వన్డేలో సెంచరీ కొట్టడంతో మిచెల్ యావరేజ్ 58.48 కి చేరింది. వన్డేల్లో కనీసం 50 ఇన్నింగ్స్ లు ఆడి 2000 పరుగులు చేసిన బ్యాటర్ల యావరేజ్ లిస్ట్ చూసుకుంటే మిచెల్ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ వన్డే బ్యాటింగ్ యావరేజ్ 58.46గా ఉంది. మిచెల్ కంటే 0.2 వెనకపడిన కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. అంతేకాదు వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్న కోహ్లీ.. మిచెల్ కు తన టాప్ స్పాట్ ను కోల్పోనున్నాడు. 

టాప్ ఫామ్ లో మిచెల్: 

డారిల్ మిచెల్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. భారత జట్టు అంటే అదే పనిగా చెలరేగిపోతున్నారు. ఇండియాపై ఇండియాలో మిచెల్ రికార్డ్ వావ్ అనేలా ఉంది. ఇండియాలో మిచెల్ చివరిసారిగా ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగు  సెంచరీలు బాదేశాడు. ఇండియాలో ఈ కివీస్ వీరుడు వరుసగా 130, 134, 84,131, 137 పరుగులు చేశాడు. నాలుగు ఇన్నింగ్స్ ల్లో  యావరేజ్ తో 616 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు.. ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న సిరీస్ లో మిచెల్ తొలి వన్డేలో 84.. రెండో వన్డేలో 131 పరుగులు.. మూడో వన్డేలో 137 పరుగులు చేసి న్యూజిలాండ్ కు భారీ స్కోర్ అందించాడు. 

న్యూజిలాండ్ భారీ స్కోర్:  

ఈ మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. పవర్ ప్లే లో బాగా రాణించినా ఆ తర్వాత పూర్తిగా తేలిపోయారు. ఆదివారం (జనవరి 18) ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ముందు ప్రత్యర్థి న్యూజిలాండ్ భారీ స్కోర్ సెట్ చేసింది. సూపర్ ఫామ్ లో డారిల్ మిచెల్ (137) సెంచరీతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్ (106) కూడా శతకం బాదడంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. మిచెల్ 137 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా తలో మూడు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, కుల్దీప్ తలో వికెట్ తీసుకున్నారు.