న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా టీమిండియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తొలి వన్డేలో 84 పరుగులు చేసిన మిచెల్.. రెండో వన్డేలో 134 పరుగులతో మ్యాచ్ ను గెలిపించాడు. ఆదివారం (జనవరి 18) ఇండియాతో జరుగుతున్న మూడో వన్దేలోనూ ఈ కివీస్ స్టార్ సెంచరీతో దుమ్ములేపాడు. ఇనింగ్స్ 36 ఓవర్లో జడేజా బౌలింగ్ లో సింగిల్ తీసుకొని 10 ఫోర్లు, 2 సిక్సర్లతో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ సిరీస్ లో మిచెల్ కు వరుసగా ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్ గా 9 వది.
ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. భారత పేసర్లు విజృంభించడంతో 5 పరుగులకే న్యూజిలాండ్ రెండు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన డారిల్ మిచెల్ జట్టును ముందుండి నడిపించాడు. మూడో వికెట్ కు విల్ యంగ్ తో కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి అజేయంగా 162 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో మిచెల్ హాఫ్ సెంచరీతో పాటు సెంచరీ మార్క్ అందుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో న్యూజిలాండ్ ప్రస్తుతం 39 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. మిచెల్ (113), ఫిలిప్స్ (75) క్రీజ్ లో ఉన్నారు.
టాప్ ఫామ్ లో మిచెల్:
డారిల్ మిచెల్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. భారత జట్టు అంటే అదే పనిగా చెలరేగిపోతున్నారు. ఇండియాపై ఇండియాలో మిచెల్ రికార్డ్ వావ్ అనేలా ఉంది. ఇండియాలో మిచెల్ చివరిసారిగా ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. ఇండియాలో ఈ కివీస్ వీరుడు వరుసగా 130, 134,84, 131, 119* పరుగులు చేశాడు. నాలుగు ఇన్నింగ్స్ ల్లో యావరేజ్ తో 500 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు.. ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న సిరీస్ లో మిచెల్ తొలి వన్డేలో 84.. రెండో వన్డేలో 131 పరుగులు.. మూడో వన్డేలో 119 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు.
Daryl Mitchell stands tall with back-to-back centuries against India 💪#INDvNZ 📝: https://t.co/MRZ6l9RU7y pic.twitter.com/OZfztuxJvw
— ICC (@ICC) January 18, 2026
