మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ కోరండి.. మీడియాపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ కోరండి.. మీడియాపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం (జనవరి 18) ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మద్దుల పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా యాజమాన్యాల కొట్లాట మీ వ్యక్తిగతం.. విచక్షణ మరిచి వ్యవహరించ వద్దు.. సహచర మంత్రులపై వార్తలు రాసే క్రమంలో నా వివరణ తీసుకోండి.. సింగరేణిలో బొగ్గంతా మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి..  అలాంటి వాళ్లకు చెప్తున్నా.. మా ప్రభుత్వంలో అలాంటి అవకతవకలకు తావుండదు.. బీఆర్ఎస్ ను బలపరిచే మీడియా రాతలు మానుకోండి అని సూచించారు సీఎం రేవంత్.
 

సీఎం రేవంత్ కామెంట్స్:

  • 2007 -08 లో మల్లు అనంత రాములు ఇల్లు చూడటానికి వచ్చాను. 
  • ఖమ్మం ఎల్లప్పుడు కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఆదరిస్తుంది. 
  • ఈ రోజు నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి.. 
  • ఆయనను రోజున స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. 
  • పేద వాడి కోసం 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశ పెట్టారు. 
  • అదే పథకాన్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 రూపాయలకే సన్న బియ్యం ప్రవేశపెట్టాము. 
  • గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలి అంటే ఉన్న వారు చనిపోతేనే వచే పరిస్థితి ఉండేది. 
  • తెలంగాణ రాష్ట్రం నలుమూలలో ఉన్న పేదవాడికి రేషన్ కార్డులు అందించాలని మంత్రులకు సూచన చేశాను
  • తెలంగాణ రాష్ట్రం లో టీడీపీ ఉండకూడదని భావించిన టీఆర్ఎస్ ను బొంద పెట్టాలి. 
  • వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం , రైతుల సంక్షేమం కోసం తొలి సంతకం చేసిన మహానుభావుడు.
  • 2004 - 2014 వరకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదవాడి ఆత్మగౌరవం నిలబెట్టింది కాంగ్రెస్. 
  • రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ పథకాన్ని కొనసాగిస్తున్నాం. 
  • పార్టీ  ప్రాంతం వేరైనా  ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. 
  • ప్రజా పాలనతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. 
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడిని అణగదొక్కింది. 
  • ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించాము. 
  • గిరిజనులు తింటున్న సన్న బియ్యంతో నేను అన్నం తింటున్నాను. 
  • నాలుగు లక్షల ఇండ్లు అందుబాటులోకి తీసుకువచ్చాం. 
  • 10 ఏండ్ల పాలనలో రూ.20 లక్షల నిధులు కేసీఆర్ వృథా చేశాడు. 
  • రాక్షసుల కుల గురువు అంటే కేసీఆర్.. శకుని లాగా కుట్రలు , పన్నాగాలు పన్నుతున్నాడు
  • నాడు మారీచుడు జింక రూపంలో వస్తే.. నేడు బీఆర్ఎస్ సోషల్ మీడియా అని తెలుసుకోండి. 
  • తుమ్మల లాంటి వారి అనుభవాన్ని వాడుకుంటున్నాం. 
  • 24 గంటల్లో అమ్మవారి గుడి నిర్మాణం చేపట్టాం. 
  • కాంగ్రెస్ పార్టీలో అవకతవకలకు చోటు లేదు. 
  • సహచర మంత్రుల పై వార్తలు రాసే క్రమంలో నా వివరణ కోరండి. 
  • 791 గ్రామ పంచాయతీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచారు. 
  • రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. 
  • నాకన్నా సీనియర్లు ఉన్నా నాకు అదృష్టం కలిసి వచ్చింది. 
  • నాకు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అవకాశం కల్పించారు. 
  • నేను ఒక్క సారి మంత్రిగా పని చేయకపోయిన  అనుభవం లేకున్నా ముఖ్యమంత్రి అయ్యాను
  • బీజేపీని ఖమ్మం ప్రజలు దరి దాపుల్లోకి కూడా రానివ్వలేదు. 
  • ఖమ్మం ప్రజలు తెలివి గల వారు కాబట్టి బిజేపిని స్వాగతించలేదు. 
  • బీజేపి దేశానికి , రాజ్యాంగానికి ప్రమాదం. 
  • ఖమ్మంలో మాజీ మంత్రి ఒంటి కన్ను శివరాసన్ బయలు దేరాడు. అతను తులసి వనంలో గంజాయి మొక్క. 
  • సున్నా వడ్డీతో వందల కోట్లు ఆడ బిడ్డలకు లోన్లు ఇస్తున్నాం. 
  • నిరుద్యోగులకు , విధ్యార్ధులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. 
  • ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నాం. 
  • ఎస్సీ కుల వర్గీకరణ సమస్యకు పరిష్కారం చేసింది కాంగ్రెస్. 
  • బీసీల లెక్కలు నాడు తెల్లోళ్లు లెక్కిస్తే .. నేడు కాంగ్రెస్ లెక్కలు వేసి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. 
  • రెండేళ్లలలో ప్రణాళిక బద్ధంగా నేడు ముందుకు సాగుతున్నాం. 
  • బీఆర్ఎస్ లో లేచేటోడు లేడు .. నిల్చునేటోడు లేడు. 
  • రాముల వారి సాక్షిగా నేను చెబుతున్నా పదేళ్ల పాటు కాంగ్రెస్ ఉండబోతుంది. 
  • పదేళ్లు టీడీపి , పదేళ్లు కాంగ్రెస్ , పదేళ్లు బీఆర్ఎస్ అన్నాయి .. పదేళ్లు కాంగ్రెస్ ఉండబోతుంది.