ఇండిగో విమాన సంస్థకు కేంద్రం షాకిచ్చింది. విమాన సర్వీసుల అంతరాయంపై విచారణ చేపట్టిన పౌర విమానయాన శాఖ జరిమానా విధించింది. 2025 డిసెంబర్ లో విమాన సర్వీసులు నడపడంతో నిర్లక్ష్యం వహించడమే కాకుండా.. భారత విమానయాన రంగం కొద్ది రోజుల పాటు సంక్షోభానికి కారణమైనందున DGCA చర్యలు తీసుకుంది. ఇండిగో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారించిన డీజీసీఏ రూ.22 కోట్ల 20 లక్షల రూపాయల జరిమానా విధించింది.
2025 డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ మధ్య విమానాల షెడ్యూల్ డిలే కావడం, భారీ ఎత్తున ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంపై ఆగ్రహించిన డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజుల్లో మొత్తం 2507 విమానాలు రద్దు కాగా, 1852 ఫ్లైట్స్ డిలే అయ్యాయి. దీంతో దాదాపు 3 లక్షల మంది ప్యాసెంజర్లు ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారు.
►ALSO READ | ముంబైలో ఊహించని ట్విస్ట్ : 29 మంది కార్పొరేటర్లను రిసార్ట్స్ కు తరలించిన ఏక్ నాథ్ షిండే..
డీజీసీఏ నుంచి ఆర్డర్స్ వచ్చినట్లు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ చైర్మన్ తెలిపారు. 19 ఏళ్ల ప్రయాణంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదని.. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపున్నట్లు తెలిపారు.
