ఇటీవల జరిగిన ఇండోర్ విషాదం, తక్షణ సురక్షిత తాగునీటి అవసరాన్ని హైలైట్ చేస్తోంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రమైన నీరు కావాలి. నీటి శుద్ది చేసేందుకు ప్రస్తుతం రకరకాలపద్దతులు వినియోగిస్తున్నాం..అందులో వాటర్ ఫిల్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి ఇంట్లో వాటర్ ఫిల్టర్ఉంటుంది సందేహమే లేదు. బ్యాక్టీరియాను తొలగించి మంచి రుచి, నీటిలో భారీ లోహాలను మోతాదును తగ్గించేందుకు ఫిల్టర్లను వాడుతున్నాం.అయితే వాటర్ ఫిల్టర్నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది? అసల వాటర్ ఫిల్టర్ నీళ్లు తాగితే మంచిదేనా?
మనం జీవించి ఉండాలంటే నీరు తాగడం అవసరం.అయితే అన్ని రకాల నీరు అంత సురక్షితం కాదు. నీటి కాలుష్యం రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో తాగే నీటిని శుభ్రపరిచేందుకు చాలా రకాల ప్యూరిఫికేషన్ పద్దతులు వాడుతున్నాం.రివర్స్ ఆస్మాసిస్(RO), క్లోరిన్ ట్రీట్ మెంట్వంటి పద్దతుల ద్వారా నీటిని ఫిల్టర్ చేస్తుంటాం. అయితే ఫిల్టర్ నీరు స్పష్టంగా, శుభ్రంగా కనిపించినప్పటికీ, ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధికారక వైరస్లు, బ్యాక్టీరియాలను కలిగి ఉంటుందంటున్నారు డాక్టర్లు. ఇవి కంటికి కనిపించవు. చాలా తక్కవ సాంద్రతలో ఉండి గుర్తించబడవు. వీటిని తీసుకుంటే అనారోగ్యసమస్యలు తలెత్తుతాయంటున్నారు.
ఫిల్టర్ చేసిన నీరు అంత సురక్షితం కాదంటున్నారు ఫరీదాబాద్ లోని ఫ్లోరిన్ హాస్పిటల్ లోని ఇంటర్నల్ మెడిసిన్ అదనపు డైరెక్టర్ డాక్టర్ బీఎన్ సింగ్. ఫిల్టర్ చేసిన నీరు తాగితే ఇన్ ఫెక్షన్లకు దారి తీస్తుందంటున్నారు. ఫిల్టర్ చేసినా నీటిలో బ్యాక్టిరియా అలాగే ఉంటుంది. అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అనేక కారణాలు వివరించారు.
మనం ఇంట్లో వాడే ఫిల్టర్లను కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్ లు ,రుచి, వాసనను మెరుగుపర్చేందుకు,సీసం వంటి భారీ లోహాలను తొలగించేందుకు రూపొందించారు. అయితే ఈ ఫిల్టర్లు అన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్ లను తొలగించేందుకు సరిపోవు. వైరస్ లు చాలా చిన్నవిగా ఉండి, సాధారణ ఫిల్టర్ ద్వారా ఈజీగా వెల్లగలవు. అందువల్ల ఫిల్టర్ చేసినప్పటికీ నీటిలో ఈ వైరస్ లు అలాగే ఉండిపోతాయి.
సరిగ్గా ఇన్ స్టాల్ చేయని కారణంగా లీకేజీలతో ఫిల్టర్ చేయని నీరు పరిశుభ్రమైన నీటితో కలిసే ప్రమాందం ఉంది. దీంతోపాటు ఫిల్టర్ హౌసింగ్, ఇతర భాగాలను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా సూక్ష్మజీవులు పేరుకుపోతాయి. ఫిల్టర్ సరిగ్గా పనిచేసినప్పటికీ ఇంట్లో పైపులలో బయోఫిల్మ్ పొరలో క్రిములు పెరుగుతాయి. ఈ కారణాల చేత నీటిని ఫిల్టర్ చేసినప్పటికీ బ్యాక్టీరియాతో నిండి ఉండటం అనారోగ్యానికి దారి తీస్తుంది.
అంతేకాకుండా నీటిని ఫిల్టర్చేసిన సీసం వంటి భారీ లోహంతోపాటు కాల్షియం, మెగ్నీషియం , పొటాషియం వంటి ఖనిజాలు కూడా తొలగించడం వల్ల భవిష్యత్తులో వీటి లోపం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.అంతే కాదు. ఫిల్టర్ చేసిన నీరు తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ డైల్యూట్ అవుతాయి. ఇవి అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతాయి. బోన్ లాస్, కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. ఫిల్టర్ చేసిన నీరు తాగితే అలసట, బలహీనత,తలనొప్పి, కండరాల తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు.
స్వచ్ఛమైన నీటికోసం..
ఫిల్టర్ నీటికి బదులుగా ఈ ప్రత్యామ్నాయాల ద్వారా పాటించడం ద్వారా స్వచ్ఛమైననీటిని పొందవచ్చంటున్నారు. నీటిని కొన్ని నిమిషాల పాటు వేడి చేసి చల్లార్చి తాగడం వల్ల ఎంతో సురక్షితం అంటున్నారు డాక్టర్లు. ఎక్కువ క్లోరిన్ వినియోగించకుండా లీటర్ నీటిలో కొన్ని చుక్కలు లిక్వడ్ బ్లీచ్ వేయడం ద్వారా 30 నిమిషాలు క్లోరిన్ ట్రీట్ మెంట్ చేసి నీటిని శుద్ది చేసుకోవచ్చంటున్నారు.
ఒక లీటర్ నీటిలో 5 చుక్కల అయోడిన్ వేసి కలిపితే అది సురక్షితమైన నీరు లభిస్తుందంటున్నారు డాక్టర్లు. వ్యక్తి హెల్త్హిస్టరీ ప్రకారం.. డాక్టర్ల సలహా తీసుకుంటూ పరిశుభ్రమైన నీటిని తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవంటున్నారు.
