- హైదరాబాద్ నుంచి రూ.600-రూ.1,110
- ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం
వరంగల్, వెలుగు: మేడారం సమ్మక్క– సారక్క జాతరకు తెలంగాణ ఆర్టీసీ టిక్కెట్ల రేట్లను ఖరారు చేసింది. వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి నడిపే ప్రత్యేక బస్సుల చార్జీలను నిర్ణయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
భక్తులు ఎక్కువగా ప్రయాణించే వరంగల్, హనుమకొండ ప్రాంతాల నుంచి బస్సుల ఆధారంగా రూ.250 నుంచి రూ.500 టిక్కెట్ చార్జీ ఉండగా.. హైదరాబాద్ నుంచి రూ.600 నుంచి రూ. 1,110 వరకు టికెట్ రేట్లను నిర్ణయించింది. ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.
