‘మెడికవర్' కార్డియాలజిస్ట్కు అంతర్జాతీయ గుర్తింపు

‘మెడికవర్' కార్డియాలజిస్ట్కు అంతర్జాతీయ గుర్తింపు

హనుమకొండ, వెలుగు: వరంగల్ మెడికవర్ హాస్పిటల్ లో సీనియర్ ఇంటర్వెన్షనల్​ కార్డియాలజిస్ట్ గా సేవలందిస్తున్న డా.సంతోష్ మోదానికి అరుదైన గుర్తింపు దక్కింది. సీఏడీ ఇంటర్వెన్షన్-2026 అంతర్జాతీయ సదస్సులో అకాడమీ ఆఫ్ కార్డియాక్ ఇంటర్వెన్షన్స్ సంస్థ ఆయనకు సీనియర్ ఇంటర్వెన్షనల్ ఫెలో గుర్తింపు ఇచ్చింది. ఈ మేరకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్డియాలజీ నిపుణుడు ప్రొ.ఆంటోనియో కొలంబో, ప్రొఫెసర్ బెర్న్ హార్ట్ మేయర్  డా.సంతోష్ మోదానికి ఈ హోదాను ప్రదానం చేశారు.

క్లిష్టమైన కార్డియాక్ ఇంటర్వెన్షన్​లో ఆయన ప్రదర్శించిన నైపుణ్యం, వృత్తిపరమైన ప్రతిభ, వైద్య రంగానికి చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఈ గుర్తింపు వచ్చిందని మెడికవర్ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా డా.సంతోష్ మోదాని మాట్లాడుతూ తనకు వచ్చిన గుర్తింపుతో  వరంగల్, పరిసర ప్రాంతాల ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో గుండె సంబంధ వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.