వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు విషయంలో ఇచ్చిన హామీ ప్రకారం పనులు నెరవేర్చుతున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం హనుమకొండ కాంగ్రెస్ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ప్రెస్‍మీట్ నిర్వహించి మాట్లాడారు.
బీఆర్‍ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉద్యమ సమయంలో, 10 ఏండ్ల పాలనలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ హామీతో సిటీ జనాలను మోసం చేశారన్నారు. కానీ, సీఎం రేవంత్‍రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.5257 కోట్ల నిధులు మంజూరు చేసి వచ్చే నెలలో పనులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వరంగల్ సిటీ అభివృద్ధి, రాబోయే తరాలకు ఎంతో మేలు చేసే మేజర్ ప్రాజెక్ట్ పనుల్లో ప్రజలు సహకరించాలన్నారు. ఇచ్చినమాట ప్రకారం యూడీసీకి నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‍రెడ్డికి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హనుమకొండ అశోక జంక్షన్‍లో సంబురాలు నిర్వహించారు
