ములుగు/ జనగామ అర్బన్/గ్రేటర్ వరంగల్/ పర్వతగిరి/ ములకలపల్లి, వెలుగు : ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్కు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చాయి. వరంగల్కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 113 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ సత్య శారదాదేవి తెలిపారు. కాగా, పర్వతగిరి మండలం గోరుగుట్టతండాలో బెల్టు షాపులు నిర్వహించవద్దని, లిక్కర్ అమ్మొద్దని సర్పంచ్విజయలక్ష్మీభాస్కర్ ఆధ్వర్యంలో పాలకమండలి తీర్మానించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు పత్రాన్ని అందజేశారు.
జనగామ ప్రజావాణికి 157 వినతులు వచ్చాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
ములుగులో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 49 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు ఏపీవో డేవిడ్ రాజుకు వినతి పత్రం అందజేశారు.
