వివేకా హత్య కేసు : కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ చార్జీషీట్

 వివేకా హత్య కేసు : కోర్టులో  సీబీఐ సప్లిమెంటరీ చార్జీషీట్

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి సీబీఐ సప్లిమెంటరీ చార్జీషీట్ దాఖలు చేసింది. ఇందులో కీలక వ్యక్తుల పేర్లున్నట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో నిందుతులకు నాంపల్లి కోర్టు 2023 జూలై  14వరకు  రిమాండ్ ను పొడిగించింది. 

మరోవైపు నేడు సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసుపై విచారణ జరిగింది. నిందితులు భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కోర్టుకు తరలించారు. 

నిందితుల రిమాండ్‌ గడువు ముగియడంతో వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019  మార్చి  14న  హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును  సీబీఐ విచారిస్తుంది.