బలిచ్చే మేకపై రామ్ అని రాసినందుకు ముగ్గురు అరెస్ట్

బలిచ్చే మేకపై రామ్ అని రాసినందుకు ముగ్గురు అరెస్ట్

మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ముంబైలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఓ మటన్ దుకాణంలో మేకపై రామ్ అని రాసి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బలివ్వడానికి సిద్దం చేసిన తెల్లని మేకపై రామ్ అని రాశారు. ముంబైలోని బేలాపూర్‌లో ఈ ఘటన జరిగింది. కొద్దిసేపటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దీనిపై చాలామంది హిందువులు మండిపడ్డారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లగా.. మహ్మద్ షఫీ షేక్, సాజిద్ షఫీ షేక్ మరియు కుయ్యం అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. అంతేకాదు ఆ మాంసం దుకాణానికి కూడా సీల్ వేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295(A), 34 ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కూడా వారిపై మోపారు.