క్యాబ్‌ డ్రైవర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

క్యాబ్‌ డ్రైవర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

క్యాబ్‌ డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్ర  ప్రభుత్వం. ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన చార్జీ మొత్తంలో కమీషన్‌ రూపంలో ఓలా, ఊబర్‌ సంస్థలు అధికంగా తీసుకుంటున్నాయని క్యాబ్‌ డ్రైవర్లు ఆందోళన  వ్యక్తం చేశారు. దీనిపై  స్పందించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఊరట ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఒక్కో రైడ్‌కు క్యాబ్‌ ఆపరేటర్లు ప్రస్తుతం 20 శాతం కమీషన్‌ వసూలు చేస్తుండగా దాన్ని 10 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు క్యాబ్‌ ఆపరేటర్ల రాబడిపై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లెవీని విధించవచ్చని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. ఓలా, ఊబర్‌లపై కొత్త మార్గదర్శకాలపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరించేందుకు రానున్న వారంలో ముసాయిదాను విడుదల చేస్తామని, హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది.