
చమ్మక్ చంద్ర.. బుల్లితెరపై ఈ పరిచయం అక్కర్లేని పేరు. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామోడీ షోలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేది చంద్ర టీం. లేడీస్ పై చేసిన చంద్ర స్కిట్స్ చాలా ఫేమస్ అయ్యాయి. అయితే ఇటీవల తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో ను వదిలి జీ తెలుగులో వచ్చే అదిరింది అనే కొత్త కామోడీ షోలో చేస్తున్నాడు చమ్మక్ చంద్ర. జబర్దస్త్ జడ్జి నాగబాబుతో పాటు కిరాక్ ఆర్పీ, ధన్ రాజ్, వేణు అదిరింది షోలో చేస్తున్నారు.
నాగబాబు, చమ్మక్ చంద్ర జబర్దస్త్ వదిలి వెళ్లడంపై రకరకాల పుకార్లు వచ్చాయి. జబర్దస్త్ షో నిర్వాహకులు మల్లెమాల ప్రొడక్షన్స్ తో గొడవలు అయ్యాయి. అందుకే చాలా మంది బయటకు వెళ్లారని టాక్ ఉంది. అయితే జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్లిపోవడంపై ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు చమ్మక్ చంద్ర. జబర్దస్త్ షో నిర్వాహకులతో తమకు ఎలాంటి గొడవ కానీ, మనస్పర్థలు లేవన్నాడు. జబర్దస్త్ కు ఆరేళ్ల నుంచి డైరెక్టర్లుగా పని చేస్తున్న నితిన్, భరత్ లు జబర్దస్త్ ను వదిలి జీ తెలుగు ఛానల్ లో అదిరింది అనే కొత్త కామోడీ షో చేస్తున్నారు. తమతో పాటు ఉన్న డైరెక్టర్లు నితిన్ భరత్ లకు సపోర్ట్ ఇవ్వాలనే ఒకే ఒక్క రీజన్ తోనే తాము జబర్దస్త్ ను వదిలి జీ తెలుగులో వచ్చే అదిరింది షోకు వచ్చామన్నాడు. రెండూ కామోడీ షోలు కాబట్టి ఏదో ఒక్క షో లో చేయాలనే రీజన్ తో అదిరింది షోలో చేస్తున్నామన్నాడు.