మాజీ సీఎం నాదెండ్లకు అస్వస్థత..

మాజీ సీఎం నాదెండ్లకు అస్వస్థత..
  •  హాస్పిటల్లో చేరిన భాస్కర్ రావు

గచ్చిబౌలి, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నాలుగు రోజుల కింద గచ్చిబౌలి నానాక్ రామ్ గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్​లో చేర్పించారు. భాస్కర్​రావు ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న వివిధ రకాల వార్తలపై ఆయన కొడుకు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని తెలిపారు. వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని అభిమానులు, శ్రేయోభిలాషులకు 
విజ్ఞప్తి చేశారు.