తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు!

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు!

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో నైరుతి రుతు పవనాలు దక్షిణ అండమాన్ సముద్రం,ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంది. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవాశముంది. దీని ప్రభావంగా రానున్న 3 రోజులు తెలంగాణ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.