చందమామ పెరట్లో రోవర్‌ ఆటలు.. ఇస్రో వీడియో రిలీజ్

చందమామ పెరట్లో రోవర్‌ ఆటలు.. ఇస్రో వీడియో రిలీజ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2023 ఆగస్టు 31  గురువారం రోజున చంద్రునిపై ప్రగ్యాన్ రోవర్‌ను సురక్షితమైన మార్గం కోసం తిప్పుతున్న తాజా వీడియోను షేర్ చేసింది.   చంద్రుడిపై బుడిబుడి అడుగులు వేస్తున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ తాజాగా చక్కర్లు కొడుతొంది.  

ఈ వీడియోలను ఇస్రో తాజాగా ట్వీట్ చేసింది.  చందమామ పేరట్లో చిన్నపిల్ల ఉల్లాసంగా ఆడుతుంటే.. తల్లి అప్యాయంగా చూస్తున్నట్లు ఉంది కదా అంటూ రాసుకొచ్చింది.  సురక్షితమైన ప్రాంతంలో రోవర్ కొట్టిన ఈ చక్కర్లను ల్యాండర్ ఇమేజర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశామని తెలిపింది.