Char Dham Yatra 2023 : చార్ధామ్ యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..

Char Dham Yatra 2023 : చార్ధామ్ యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..

చార్ ధామ్ యాత్ర అనేది హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక యాత్ర. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది భక్తులు భగవంతుని అనుగ్రహం కోసం ఈ యాత్రను ప్రారంభిస్తారు. చార్ ధామ్ యాత్ర సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో మొదలై వాతావరణ పరిస్థితుల ఆధారంగా అక్టోబర్ లేదా నవంబర్‌లో ముగుస్తుంది. 2023లో ఈ  యాత్ర ఏప్రిల్ 29 నుండి ప్రారంభమై నవంబర్ 3న ముగుస్తుంది. అయితే  హిందూ క్యాలెండర్ ఆధారంగా తేదీల్లో ఏమైనా మార్పుండొచ్చు.

రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?

ఈ యాత్ర చేసే అవకాశం రావడం కూడా భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ప్రతీయేడు కొంతమందికి మాత్రమే ఛార్ ధామ్ యాత్ర చేసే అవకాశం దక్కుతుంది. ఈ చార్ ధామ్ యాత్ర ఎప్పుడు , ఎలా మొదలవుతుంది. ఎలా వెళ్లాలో తెలుసుకోవడం మంచిది . ఎందుకంటే ఈ యాత్రకు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరుపడితే వాళ్లు వెళ్లడానికి వీళ్లేదు. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వాళ్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2014 ప్రకృతి వైపరీత్యాలు కారణంగా యాత్రికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ ధామ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.

ఛార్ ధామ్ సందర్శించే భక్తులకు ఫోటోమెట్రిక్ లేదా బయోమెట్రిక్ నమోదును తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, భక్తులకు ఫోటో/బయోమెట్రిక్ కార్డ్‌లు,  యాత్ర రిజిస్ట్రేషన్ లెటర్ జారీ చేస్తారు. చార్ ధామ్ యాత్ర కోసం ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ రెండూ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి మీరు అధికారిక వెబ్‌సైట్‌  http://www.registrationandtouristcare.uk.gov.in. ను సందర్శించవచ్చు

  • ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం  చార్ధామ్ యాత్ర మార్గంలో అనేక రిజిస్ట్రేషన్ బూత్‌లు ఉన్నాయి.
  • ఈ చార్ ధామ్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు. అధికారిక వెబ్‌సైట్‌లో లేదా రిజిస్ట్రేషన్ కౌంటర్లలో భక్తులు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్స్

  • యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వారు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ కావాలి.
  • యాత్రా రిజిస్ట్రేషన్  కోసం ఇతర పేర్లలో యాత్రా ఈ పాస్, యాత్ర అనుమతులు, రిజిస్ట్రేషన్ కార్డ్‌లు ఉన్నాయి. మీరు డైనింగ్, హోటల్ సేవలను ఉపయోగించడానికి కార్డ్‌ని ఉపయోగించవచ్చు.