చిన్నోడి మోటివేషనల్ వీడియో.. చూసి తీరాల్సిందే

చిన్నోడి మోటివేషనల్ వీడియో.. చూసి తీరాల్సిందే

మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు జీవితం మీద విరక్తి కలుగుతుంది. ‘ఈ లైఫ్​ ఎందుకు?’ అనిపిస్తుంది. బతుకు మీద ఆశ చచ్చిపోతుంది. ఎప్పుడో ఒకప్పుడు అందరికీ ఈ ఫీలింగ్ వస్తుంది. అలాంటి సిచ్యుయేషన్​లో మోటివేషనల్​ వీడియోలు అద్భుతంగా పనిచేస్తాయి. నెగెటివ్​ ఆలోచనల నుంచి బయటపడేయడమే కాకుండా బతుకుపై ఆశల్ని పెంచుతాయి. ‘ఎన్ని సమస్యలు ఉన్నా లైఫ్​ని ఎంజాయ్​ చేయాలి. చిల్​ మారో’ అంటున్నాడు ముంబైకి చెందిన చట్​పట్ అనే పదేండ్ల పిల్లాడు. ముంబై మురికి వాడల్లో ఉండే  ఇతను జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎలా చిల్​ అవ్వాలో హిందీలో చెప్పిన తీరు ఆందర్నీ ఆకట్టుకుంటోంది.  


‘‘టెన్షన్​గా ఉందా? డోంట్​ వర్రీ. ఒత్తిడిగా అనిపిస్తే కొంచెం సేపు బ్రేక్​ తీసుకోండి. మేము కూడా అదే చేస్తాం. ఈ విషయాలు మీరు పాటించడమే కాదు మీ ఫ్రెండ్స్​కి కూడా చెప్పండి. మనసులో ఏదీ దాచుకోవద్దు. ఏరోజు జరిగింది ఆ రోజే మర్చిపోవాలి. చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి” అంటూ తన ఫ్రెండ్స్​తో కలిసి చట్​పట్​ చేసిన మోటివేషనల్​​ వీడియో నెట్​లో వైరల్​ అవుతోంది. ఈ వీడియోని ఇప్పటికే 50వేల మందికి పైగా చూశారు. ఇతనికి ‘చట్​పట్​ గ్యాన్​’ అనే ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్ ఉంది. దానికి 16వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇంతకు ముందు ఈ చిన్నోడు చేసిన ‘కిరాయి కట్టకుండా ముంబైలో ఉండడం ఎలా?’, ‘ఇతర దేశాల నుంచి ఫండ్స్​ తెచ్చుకోవడం ఎలా?’  వీడియోలు కూడా పాపులర్​​ అయ్యాయి.