ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్.. పిలుపునిచ్చిన చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్

ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్.. పిలుపునిచ్చిన చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్

హైదరాబాద్: ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ చేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. పౌల్ట్రీ కంపెనీల విధానంపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే 20 రూపాయలు తక్కువ ఇస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. రోజు రోజుకు చికెన్ రేటు పెరుగుతుంది కానీ తమకు ఇచ్చే మార్జిన్ తగ్గిస్తున్నారని వ్యాపారులు వాపోయారు. 

పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. మార్జిన్ పెంచకపోతే వ్యాపారం చేయలేమని.. షాపులు మూసివేస్తామని చికెన్ వ్యాపారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.360 నుంచి 370 రూపాయల వరకూ ఉంది..

చికెన్‌‌‌‌‌‌‌‌ ధరలు వారం రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగాయి. వారం రోజుల కింద కేజీ చికెన్‌‌‌‌‌‌‌‌ రూ.320 వరకు ఉండగా.. మూడు, నాలుగు రోజులుగా రూ.350, రూ.360, రూ. 380 వరకూ పెరుగుతూ వస్తోంది. లైవ్‌‌‌‌‌‌‌‌ కోడి కిలో రూ. 220 అమ్ముతుండగా.. స్కిన్‌‌‌‌‌‌‌‌తో కేజీ చికెన్‌‌‌‌‌‌‌‌ రూ.340కి అమ్ముతున్నారు. చాలా మంది వ్యాపారులు పేపర్‌‌‌‌‌‌‌‌ ధరను మించి అమ్ముతుండడంతో కొన్ని చోట్ల చికెన్‌‌‌‌‌‌‌‌ సెంటర్ల నిర్వాహకులతో వినియోగదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. నాటు కోడి ధర కేజీ రూ.700 నుంచి రూ.800 మధ్య పలుకుతోంది.

 ఎండల కారణంగా బ్రాయిలర్ కోళ్లు చనిపోతుండడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌లో సప్లై తగ్గుతోంది. దీంతో పాటు ఎండల కారణంగా కోళ్లు దాణా తక్కువ తిని నీళ్లు ఎక్కువగా తాగుతుండడంతో ఆశించినంత ఎదుగుదల ఉండడంలేదు. మరోవైపు కోడి పిల్లల(చిక్స్) ధరలు, దాణా ఖర్చులు కూడా పెరిగాయి. అంతేగాక కోళ్లను కాపాడుకునేందుకు కూలర్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం పౌల్ట్రీ ఫామ్స్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులపై ఆర్థికంగా అదనపు భారంగా పడుతోంది. 

ఈ కారణంతో చాలా మంది పౌల్ట్రీ రైతులు వేసవిలో కోళ్ల పెంపకాన్ని నిలిపివేయడంతో సప్లై చాలా వరకు తగ్గింది. ఎండలు ముదురుతుండడంతో రాష్ట్రంలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంతోనే చికెన్‌‌‌‌‌‌‌‌ ధర రికార్డు స్థాయికి చేరిందని, మరికొన్ని రోజుల్లో కేజీ చికెన్‌‌‌‌‌‌‌‌ రూ. 400 దాటే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.