శ్రావణం ఎఫెక్ట్… చికెన్@120

శ్రావణం ఎఫెక్ట్… చికెన్@120

భారీగా తగ్గిన ధర

శ్రావణ మాసం దెబ్బకు సిటీలో చికెన్ వినియోగం తగ్గి కోళ్ల అమ్మ కాలు పడిపోయాయి. ఒక్కసారిగా గిరాకీ తగ్గడంతో రేటు కూడా తగ్గించాల్సి వచ్చిందని వ్యాపారులు చెబుతు న్నారు. నెల క్రితం రూ.280 పలికిన చికెన్​ ప్రస్తుతం లైవ్​ రూ.120కి చేరింది. సాధారణంగా శ్రావణ మాసాన్ని చాలామంది పవిత్రంగా భావించి నెల రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటారు. ప్రతి ఆదివారం 12 లక్షల నుంచి 15 లక్షల కిలోల చికెన్ అమ్ముడవుతుందని ప్రస్తుతం 60 శాతం అమ్మకాలు తగ్గాయని పౌల్ట్రీ ప్రతినిధులు చెబుతున్నారు.

హైదరాబాద్, వెలుగు: సిటీలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. శ్రావణ మాసం కారణంగా అమ్మకాలు లేక వ్యాపారులు ధర తగ్గించారు. ఎండాకాలంలో కిలో రూ.280 వరకు అమ్మగా, ప్రస్తుతం కోడి కిలో రూ.120కి అమ్ముతున్నారు. స్కిన్​లెస్​ కిలో రూ.145కి లభిస్తోంది. నగరంలో గతం కంటే 60శాతం అమ్మకాలు తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఏటా శ్రావణ మాసంలో మటన్, చికెన్‌తో అమ్మకాలు తగ్గుముఖం పడతాయి. దేవాలయాలకు వెళ్లడం, పూజల కారణంగా చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికితోడు వర్షాలకు వ్యాధులు ప్రబలడమూ చికెన్​ అమ్మకాలకు చిక్కులు తెస్తోంది. అమ్మకాలు తగ్గడంతో ఆదాయం తగ్గి వర్కర్లకు జీతాలు ఎలా ఇయ్యాలని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నష్టాల్లో పౌల్ట్రీ రంగం

రెండు నెలలుగా ఫీడ్ కాస్ట్ పెరిగి ఫౌల్ట్రీ రంగం నష్టాల్లో ఉంది. శ్రావణం రావడం వల్ల అమ్మకాలు పడిపోయి ఇండస్ట్రీ నష్టాల్లోకి వెళ్లింది. రూ.15 ఉన్న మొక్కజొన్న రేటు రూ. 25 అవ్వడంతో ఖర్చు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న ఇంపోర్ట్ చేయనివ్వదు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇవ్వడం ఒక్కటే ఊరటగా ఉంది. ‑ జి.రంజిత్ రెడ్డి, ఎంపీ, పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు