గోద్రేజ్ కుటుంబం విడిపోయింది.. 127 ఏళ్ల చరిత్రకు ముగింపు.. లక్షల కోట్ల ఆస్తి పంపకాలు

గోద్రేజ్ కుటుంబం విడిపోయింది.. 127 ఏళ్ల చరిత్రకు ముగింపు.. లక్షల కోట్ల ఆస్తి పంపకాలు

ఇండియాలో ఉమ్మడిగా వ్యాపారం చేస్తున్న కుటుంబాల్లో గోద్రెజ్ ఫ్యామిలీ ఒకటి. ఇప్పుడు గోద్రేజ్ కుటుంబం విడిపోయింది..127 ఏళ్ల చరిత్రకు ముగింపు కార్డు పడిం ది. లక్షల కోట్ల ఆస్తి పంపకాలు జరిగాయి. రిలయన్స్, టాటా, మిస్త్రీ లా మాదిరిగానే వ్యాపారంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.  గోద్రెజ్ గ్రూప్ పేరుతో సబ్బుల నుండి ఏరోస్పేస్ వరకు ఉత్పత్తుల రంగంలో రాణిస్తోంది. ఈ దిగ్గజ గోద్రేజ్ గ్రూప్‌కు గోద్రేజ్ కుటుంబం సారథ్యం వహిస్తుండగా అనివార్య కారణాలతో చీలిక రాగా ఇప్పుడు విడిపోయింది. 

గోద్రెజ్ గ్రూప్ లోని లిస్టెడ్ కంపెనీలు (73) ఆది గోద్రెజ్, నాదిర్ గోద్రెజ్ వారి కుటుంబ సభ్యుల హ్యాండోవర్ లో ఉంటాయి.  గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ అగ్రోవెట్ మరియు ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్‌తో కూడిన గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (GIG) కు నాదిర్ గోద్రెజ్ చైర్‌పర్సన్‌గా ఉంటారు. పిరోజ్షా గోద్రెజ్ GIG యొక్క ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉంటారు

జెంషెడ్ గోద్రెజ్, స్మితా గోద్రెజ్ కృష్ణకు అన్ లిస్టెడ్ గోద్రెజ్ అండ్ బోయ్స్ తో పాటు దాని అనుబంధ సంస్థలు, ముంబైలోని 3400 ఎకరాల విలువైన భూమితోపాటు ఇతర భూములను పంచుకోనున్నట్టు తెలుస్తోంది.