ఓయూలో వేసవి సెలవులు రద్దు

ఓయూలో వేసవి సెలవులు రద్దు
  • హాస్టల్స్, మెస్​లు యథావిధిగా కొనసాగుతాయి : రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ

సికింద్రాబాద్, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీలో వేసవి సెలవులు రద్దయ్యాయి. సోమవారం ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. హాస్టల్స్, మెస్​లు యథావిధిగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్​అవుతున్న విద్యార్థుల విజ్ఞప్తి మేరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

క్రిశాంక్​పై ఓయూ పీఎస్​లో కేసు

గత ఏడాది ఓయూ వేసవి సెలవులకు సంబం ధించి.. ఫేక్ ​సర్క్యూలర్​ను సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేసిన బీఆర్ఎస్​ నాయకుడు మన్నె క్రిశాంక్​పై ఓయూ అధికారులు వర్సిటీ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తాము జారీ చేసిన సర్క్యూలర్​కు బదులు ఫేక్​ సర్క్కూలర్​ను తయారుచేసి  సోషల్​మీడియాలో పెట్టి వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించేలా న్యూస్​ను స్ప్రెడ్​ చేస్తున్న క్రిశాంక్​పై చట్టపరంగా చర్యలు

తీసుకోవాలని ఓయూ చీఫ్​ వార్డెన్ శ్రీనివాస్​రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో క్రిశాంక్​ పెట్టిన సర్క్యూలర్ ​నకిలీదని.. దానిపై సర్క్కూలర్​ నంబర్​ కూడా పెన్నుతో రాసి ఉందని, తన సంతకాన్ని కూడా కాపీ చేశాడని ఆయన పేర్కొన్నారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు క్రిశాంక్​పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.