తలస్నానం ఎలా చేయాలి.. ఏ షాంపూను ఎలా వాడాలో తెలుసుకోండి..లేదంటే బట్టతల గ్యారంటీ..!

తలస్నానం ఎలా చేయాలి.. ఏ షాంపూను ఎలా వాడాలో తెలుసుకోండి..లేదంటే బట్టతల గ్యారంటీ..!

రెండు రోజుల టూర్​ కు వెళ్లి వస్తే చాలు..  వెంటనే ఇంటికి వచ్చి తల స్నానం చేస్తాం..పూర్వకాలంలో కుంకుడుకాయలను నలగ్గొట్టి.. వాటి రసంతో తల స్నానం చేసేవాళ్లం .. కాని ఇప్పుడు అంతా టైంలేదూ.. జనాలకు అంత తీరిక.. ఓపిక కూడా ఉండట్లేదు.  అందుకే మార్కెట్లో దొరికే షాంపోలను తెచ్చుకొని  తల స్నానం చేస్తున్నాం.   షవర్​ కింద ఉండి.. షాంపూ ప్యాకెట్ చించి.. తలపై పోసి నురుగు వచ్చే వరకు రుద్ది తల స్నానం చేసి అయిందనిపిస్తాం.  అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడుతుందని నిపుణులు అంటున్నారు.  అసలు షాంపూను ఎలా వాడాలి.. ఏ రకమైన షాంపూ వాడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

 షాంపూ వాడేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తారో తెలుసా? ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నాం కదా.. వాటిని వాడడంలో ఇంకా తప్పులు చేస్తామా అనిపించవచ్చు. కానీ నిజానికి చాలామంది షాంపును వాడడం లో చాలా తప్పులు చేస్తుంటారు. ఇలా చేయడం వలన జుట్టు ఊడుతుంది.  త్వరగా బట్టతల బాబాయిలు..జుట్టు ఊడిన అమ్మమ్మలు అయిపోతాం.. 

మార్కెట్ లో ఎన్నో రకాల షాంపూలు దొరుకుతున్నాయి.కానీ, వాటిల్లో ఏవి తలకు బాగా సరిపోతాయో తెలియక ఆలోచిస్తుంటారు. ప్రత్యేకించి డ్రై, ఆయిలీ, బ్రిటిల్ వీటిల్లో మీ జుట్టు ఏరకానికి సంబంధించిందో తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. 

►ALSO READ | ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీ వ్యాధులు నయమవుతాయా ? కిడ్నీ ఆరోగ్యంపై డాక్టర్ల హెచ్చరిక!

చాలామంది షాంపూ కమ్ కండీషనర్లను వాడుతుంటారు. కాని వాటిని వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. షాంపూ, కండీషనర్ ఒకే దాంట్లో ఉండడం వలన ఏ ప్రయోజనం ఉండదు. అందుకే వాటిని మానేసి అనవసరమైన ఖర్చు తగ్గించుకోవడం మంచిది. షాంపూ వాడడానికి ముందు జుట్టు ఆరి ఉండాలి. లేదంటే అందులోని రసాయనాలు మీ జుట్టుమీద ప్రభావితం చేస్తాయి. 

వెంట్రుకల చివర్లే కాకుండా వాటి కుదుర్ల మీద షాంపుని అప్లై చేయాలి. షవర్ కింద ఉన్నప్పుడు జుట్టు చివర్లతో పాటు వాటి కుదుర్ల వరకు శుభ్రమయ్యేలా చేసుకోవాలి. అదేవిధంగా షాంపూను రోజూ కాకుండా రెండు రోజులకు ఒకసారి మాత్రమే వాడటం మంచిది. ఒకవేళ జుట్టు జిగటగా ఉందనిపిస్తే కొద్దిగా డ్రై షాంపూను వాడొచ్చు.. ఇలా చేయడం వలన జుట్టు ఆకర్షణీయంగా మారుతుంది.

-వెలుగు,లైఫ్​–