రెండ్రోజుల తర్వాత జైల్లోంచి వచ్చిన చెల్లిని చూసి మురిసిన అన్న

రెండ్రోజుల తర్వాత జైల్లోంచి వచ్చిన చెల్లిని చూసి మురిసిన అన్న

పిల్లల స్వచ్ఛమైన  ప్రేమకు హద్దులుండవు.  అది ఎవరైనా సరే.  తల్లిదండ్రులైనా,   తోబుట్టువైనా,  దోస్తయినా .. వాళ్లు చూపే  ప్రేమ అనంతం. ఇక అదీ   తోబుట్టువైతే   చెప్పటానికి  మాటలు చాలవు. వారిపై  ఈగ వాలనివ్వరు.  ముద్దు చేస్తూ క్షణం కూడా  విడిచి ఉండరు. అలాంటిది తన చిట్టి  చెల్లెలు  రెండు రోజులు  కనిపించకపోవటంతో  ఆ చిన్నారి తట్టుకోలేకపోయాడు. రెండ్రోజుల తర్వాత  చెల్లిని చూసి  మురిసిపోయాడు. తల్లి  వారిస్తున్నా... చెల్లిపై ముద్దులు  కురిపించాడు. ఈగలు వాలుతుంటే కర్చిప్ తో  ఊపుతూ  చెల్లిపై  ప్రేమను చూపించాడు. 

కొందరు తల్లులు  పిల్లలను  వదిలి జైలుకెళ్లారు. వాళ్లు  జైలు నుంచి  వచ్చిన తర్వాత   పిల్లల మొహాల్లో  ఆనందం కనిపించింది.  జైలు నుంచి బయటకు రాగానే  తల్లులను  చుట్టేసి  కన్నీళ్లు  పెట్టుకున్నారు. పిల్లలను  చూసి తల్లులు తల్లడిల్లిపోయారు.  అది చూసిన  ప్రతి ఒక్కరికీ  కళ్లు చెమ్మగిల్లాయి.

ఇది ఖమ్మం  జిల్లాలో జరిగింది. హత్యాయత్నం  కేసు పెట్టి.. ఖమ్మం జిల్లా కొణిజర్ల  మండలం  యల్లన్ననగర్ కు  చెందిన పోడు  రైతులను జైలుకు పంపారు  పోలీసులు. చంటి పిల్లల  తల్లులను  కూడా  జైల్లో వేశారు. ఇవాళ వాళ్లు  జైలు  నుంచి విడుదలయ్యారు.  తన తల్లి   బయటకొచ్చినప్పుడు  తన చెల్లిని  చూసి   ఈ బుడ్డోడు  ఇలా ప్రేమను కురిపించాడు.