చైనా హెచ్చరిక : మా కంపెనీస్‌ను వెనక్కినెడితే అమెరికాకే చేటు

చైనా హెచ్చరిక : మా కంపెనీస్‌ను వెనక్కినెడితే అమెరికాకే చేటు

బీజింగ్: అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి తమ దేశ కంపెనీస్‌ను వెనక్కినెట్టడం యూఎస్ ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగిస్తుందని చైనా శుక్రవారం హెచ్చరించింది. తమ దేశానికి చెందిన కంపెనీల అకౌంటింగ్ పద్ధతుల విషయంలో వాషింగ్టన్ తొందరపాటుతో జెనరలైజేషన్స్ చేస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ ఆరోపించారు. చైనా సంస్థల మోసపూరిత అకౌంటింగ్ పద్ధతుల గురించి ఇన్వెస్టర్స్‌ను హెచ్చరిస్తూ యూఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో వార్నింగ్ ఇవ్వడంపై సమాధానంగా జెంగ్ పైవ్యాఖ్యలు చేశారు.