హైదరాబాద్, వెలుగు: క్రిస్మస్ ఫెస్టివల్ నేపథ్యంలో గ్రేటర్ సిటీలోని షాపింగ్ మాల్స్, గిఫ్ట్ షాపులు, బేకరీల్లో కస్టమర్ల రద్దీ నెలకొంది. క్రిస్మస్ ట్రీలు, శాంటా క్లాజ్లు, స్టార్లు, గ్రీటింగ్ కార్డులు, డెకరేషన్ ఐటమ్స్, కేక్‌లు కొనేందుకు వచ్చిన వారితో ఆయా షాపుల్లో సందడి కనిపించింది. మరోవైపు సిటీలోని చర్చిలన్నీ డిఫరెంట్థీమ్స్, కలర్ ఫుల్ లైట్లతో వెలిగిపోతున్నాయి.
క్రైస్తవులందరూ ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ , ఆల్ సెయింట్స్ చర్చి, అబిడ్స్ లోని సెయింట్ జార్జ్, వెస్లీ చర్చి, గన్ ఫౌండ్రీలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ , ఈస్ట్ మారేడ్ పల్లిలోని సెయింట్ జోన్స్ ది బాప్టిస్ట్ చర్చి, నాంపల్లిలోని సెంటినరీ మెథడిస్ట్ చర్చి, బంజారాహిల్స్ లోని సెయింట్ ఆల్ఫోన్స్క్యాథలిక్ చర్చి, ముషీరాబాద్‌లోని హెబ్రోన్ చర్చిలతోపాటు సిటీలోని అన్ని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఫెస్టివల్‌కు రెడీ అయిపోయాయి.
