
- ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే క్లిక్ మనిపిస్తున్నరు
- పోలీసుల వాట్సాప్‌కు పోస్టింగ్, ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్
- గతేడాది సిటీ పోలీసులకు సోషల్ మీడియా నుంచి 13,483 కంప్లయింట్స్
- స్మార్ట్ పోలీసింగ్‌కు గుడ్ రెస్పాన్స్
‘ ట్రాఫిక్ పోలీసులకు, సీసీ కెమెరాలకు చిక్కకుండా రూల్స్ బ్రేక్ చేసేవారిని సిటిజన్స్ క్యాప్చర్ చేస్తున్నారు. ఆ ఫొటోలను పోలీసుల సోషల్ మీడియా అకౌంట్స్ కి పోస్టు చేస్తున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులకు చలానాలు జనరేట్ చేసి యాక్షన్ తీసుకుంటున్నారు. ఇలా సిటిజన్ ఫ్రెండ్లీ లో భాగంగా పోలీసులు నిర్వహిస్తున్న స్మార్ట్ పోలీసింగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.’
హైదరాబాద్, వెలుగు: సుల్తాన్‌బజార్‌లో ముగ్గురు యువకులు రాంగ్ రూట్ లో ట్రిపుల్ రైడింగ్.. గోషామహల్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్.. సికింద్రాబాద్ లో ఓ వ్యక్తి సెల్‌ఫోన్ డ్రైవింగ్, నో పార్కింగ్ ప్లేస్‌లో పోలీస్ వెహికల్ ….ఇలా గ్రేటర్ సిటీలోని వివిధ ఏరియాల్లో రూల్స్ బ్రేక్ చేస్తున్న వారికి సిటిజన్లు స్మార్ట్‌గా చెక్ పెడుతున్నారు. మొబైల్ ఫోన్‌లో క్యాప్చర్ చేసి పోలీస్ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తున్నారు. పోలీస్ వెహికల్స్ ను సైతం సిటిజన్లు వదలడం లేదు. రూల్స్ బ్రేక్ చేసిన పోలీస్ వెహికల్స్ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. సిగ్నల్స్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్,ర్యాష్ డ్రైవింగ్ సిటీ ట్రాఫిక్‌లో ప్రమాదాలకు కారణమవుతున్నాయి.హెల్మెట్ లేకపోవడంతో ఎంతో మంది చనిపోతున్నారు. నో పార్కింగ్ ప్లేసెస్‌లో వెహికల్ పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ వయొలేట్ చేస్తున్న వెహికల్స్‌ను సిటిజన్లు క్యాప్చర్ చేస్తున్నారు.
నిమిషాల్లోనే రెస్పాన్స్
సిటిజన్ ఫ్రెండ్లీలో భాగంగా సోషల్ మీడియా పోస్టింగ్స్‌కి గ్రేటర్ ట్రాఫిక్ పోలీసులు రెస్పాండ్ అవుతున్నారు. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్నతాధికారుల ఫోకస్ ఎక్కువగా ఉండడంతో సిటిజన్లకు స్పీడ్ గా రిప్లయ్ ఇస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే ఏరియా,టైమ్ తెలుసుకుని ట్రాఫిక్ చలాన్ జనరేట్ చేసి ఈ –చలాన్ పబ్లిక్ సైట్‌లో దాన్ని అప్ లోడ్ చేస్తున్నారు. వయొలేషన్‌ను బట్టి ఆయా సెక్షన్స్ కింద ఫైన్లు విధిస్తున్నారు. 5 కంటే ఎక్కువ చలాన్స్ పెండింగ్ లో ఉన్న వెహికల్ ఓనర్స్ కి నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. ఇలాంటి వెహికల్స్‌ను పోలీస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చెకింగ్‌లో సీజ్ చేస్తున్నారు. సరైన నంబర్ ప్లేట్స్ లేకుండా రోమింగ్ చేస్తున్న వెహికల్స్ ను సస్పెక్ట్ లిస్ట్‌లో పెడుతున్నారు. వయొలేషన్స్ ఎక్కువగా ఉన్న రూట్స్‌ను పోలీసులు గుర్తిస్తున్నారు. గవర్నమెంట్ వెహికల్స్ ,యూనిఫామ్‌లో ఉన్న పోలీసులపై సిటిజన్స్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న పోలీస్ సిబ్బందిని క్యాప్చర్ చేసి పోలీస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. వెహికల్‌పై చలాన్ జనరేట్ చేసేలా కంప్లయింట్ పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి పోస్టింగ్స్‌పై పోలీసులు తప్పనిసరి యాక్షన్ తీసుకుంటున్నారు.
ప్రతి నెల సుమారు 1300కి పైగా కంప్లయింట్స్
గ్రేటర్‌లోని 3 కమిషనరేట్ల పోలీస్ వాట్సాప్‌లకి ప్రతి నెల సుమారు 1,300 సిటిజన్ పోస్టింగ్స్ వస్తున్నాయి. గతేడాది అత్యధికంగా హైదరాబాద్ పోలీసులకు 13,483 వాట్సాప్ కంప్లయింట్స్ వచ్చాయి. ఇందులో 13,236 పోస్టింగ్స్‌పై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. వీటి ఆధారంగా చలానాలు జనరేట్ చేస్తున్నారు. దీంతో పాటు సిటిజన్స్ ఒపీనియన్,ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా రూల్స్ బ్రేకర్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అవేర్ నెస్ పెరుగుతోంది
సిటిజన్ల నుంచి స్మార్ట్ పోలీసింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రాఫిక్ వయొలేటర్స్ ఫొటోలను వారు మాకు షేర్ చేస్తున్నారు. ఇలాంటి సోషల్ వర్క్ తో ట్రాఫిక్ రూల్స్ పై మరింత అవేర్ నెస్ పెరుగుతోంది. ట్విట్టర్ లో వారు మాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. రోడ్లపై సమస్యలను మా దృష్టికి తీసుకొస్తున్నారు.
– అనిల్ కుమార్, అడిషనల్ సీపీ, ట్రాఫిక్, హైదరాబాద్
For More News..