హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రారంభం నుంచే అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ పై ఫొటో, రూల్ నంబర్ ముద్రించి ఇవ్వలేదనీ కమిషన్ అధికారులు వివరణ ఇచ్చారు. ఓఎంఆర్ షీట్‌పై ఇటీవల ప్రింట్ చేయట్లేదనే వాదనలు తప్పని తెలిపారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్ సీ) కూడా ఓఎంఆర్ పై హాల్ టికెట్ నంబర్, అభ్యర్థి ఫొటోలు ప్రింట్ చేయలేదని, అభ్యర్థులే వివరాలను బబుల్ చేయాల్సి ఉంటుందని వివరించారు. కొందరు నాయకులు కావాలని టీఎస్పీఎస్సీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అభ్యర్థులు గమనించాలని సూచించారు.
