సుఖ సంతోషాలతో బతుకమ్మ పండుగ జరుపుకోండి

సుఖ సంతోషాలతో బతుకమ్మ పండుగ జరుపుకోండి

హైదరాబాద్‌: సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్  రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని సీఎం దుర్గామాతను వేడుకున్నారు. తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ పండుగ వేళ ఆడబిడ్డల ఆటపాటలతో పల్లెలు, పట్టణాలు సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీఎం అభినందనలు తెలిపారు. అందరూ కూడా శాంతియుతంగా దసరా వేడుకలను జరుపుకోవాలని కోరారు.