యాదగిరిగుట్టలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

యాదగిరిగుట్టలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. శనివారం (మే 23) పలువురు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం యాదగిరిగుట్టలో రూ.100 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 

అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‎లో యాదగిరి గుట్టకు చేరుకున్న సీఎం రేవంత్‎కు అధికారులు, ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యే్క పూజలు నిర్వహించారు. కంచి కామకోటీ పీఠాధిపతి శంకర వియేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. 

ఈ పర్యటనలో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా టెంపుల్  సిటీలో రూ.43 కోట్లతో 15 ఎకరాల్లో నిర్మించనున్న లక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల, కొండపైన కల్యాణ మండపం, దీక్షాపరుల సదనం, కింది నుంచి కొండ పైకి మెట్ల మార్గంలో పైకప్పు ఏర్పాటు, వాయువ్య దిశ ద్వారా ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రత్యేక మెట్ల మార్గం నిర్మాణాలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. దాదాపు రూ.100 కోట్లతో చేపట్టే ఈ పనులకు సంబంధించి టెంపుల్ సిటీలో ఒకే దగ్గర ఏర్పాటు చేసి న ఐదు శిలాఫలకాలను ఆవిష్కరించారు.

11 గంటలకు తిరుగు ప్రయాణం

సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం 8:30 గంటల‎కు హెలికాప్టర్‎లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. యాగశాల ప్లేస్‎లో ఉన్న హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్  ఘాట్ రోడ్డు మీదుగా ఉదయం 8:40 గంటల వరకు కొండపైకి చేరుకుంటుంది.

అనంతరం గర్భగుడిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని 9:15 గంటల వరకు టెంపుల్ సిటీకి చేరుకుంటారు. అక్కడ 9:45 గంటల వరకు వేద పాఠశాలకు భూమిపూజ, మిగతా అభివృద్ధి పనులకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేస్తారు. 9:50 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్‏కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. 10:45 గంటలకు హెలిప్యాడ్‎కు చేరుకుని హైదరాబాద్  తిరుగు ప్రయాణం కానున్నారు.