తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ.. 100 ఏండ్ల భవిష్యత్కు ప్రణాళికలు : రేవంత్

తెలంగాణకు  ప్రపంచంతోనే  పోటీ.. 100 ఏండ్ల భవిష్యత్కు ప్రణాళికలు : రేవంత్

తెలంగాణ ప్రపంచంతో పోటీపడాలనేదే  తమ  లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  హైదరాబాద్ లో  సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్యా, నైపుణ్యాభివృద్ధి అంశంపై జరిగిన  సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు రేవంత్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..తెలంగాణకు ఇతర రాష్ట్రాలతో పోటీనే లేదు..ప్రపంచంతోనే తమ పోటీ అని చెప్పారు. వందేండ్ల భవిష్యత్ కు ప్రణాళికలు  వేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లాంటి నగరం ఎక్కడా లేదన్నారు. పెట్టుబడులు పెట్టాలని సూచించారు. 

పారిశ్రామిక వేత్తలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు సీఎం రేవంత్.  వ్యాపార వేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పెట్టుబడులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఐఐటీలతో స్కిల్ డెవ్ లప్ మెంట్ సెంటర్ల అనుసంధానం చేస్తామన్నారు. ఫార్మా విలేజ్ లను  డెవ్ లప్ చేస్తామని చెప్పారు.  జహీరాబాద్ లో  నిమ్స్ కు అనుమతులు వచ్చాయన్నారు.

తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి..ఇపుడెవరూ  రాజకీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు రేవంత్.  ఈ ప్రభుత్వం అందరిదీ..మీరు కోరుకుంటేనే ఇక్కడికి వచ్చామని.. రాష్ట్రాభివృద్ధికి అందరి సహకాం అవసరమన్నారు.