సత్య హరిశ్చంద్రుడి తమ్ముడివైతే .. సభకు ఎందుకు రావు

సత్య హరిశ్చంద్రుడి తమ్ముడివైతే .. సభకు ఎందుకు రావు

మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి బృందం పరిశీలించింది.. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై ఏర్పాటు చేసిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ వీక్షించిన అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు. మూడు బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవు. నీళ్లు నింపితే కానీ భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి.  కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధమన్నారు. గత ప్రభుత్వ హయాంలో..   మేడిగడ్డ కుంగినప్పుడు పోలీసుల నిర్బంధం తో రాలేక పోయాము. రాహుల్ గాంధీ తో కలిసి రావడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది అని చూసే అవకాశం రాలేదు. తన తప్పులు కప్పి పుచ్చుకోవాలని చూసింది గత ప్రభుత్వము. ప్రాజెక్టు డిసైన్ లోపం.. బడ్జెట్ అంచనా లోపం తో అవినీతి. . కాగ్ నివేదిక లో కూడా వేల కోట్ల దోపిడీ పాల్పడింది అని చెప్పింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు. మూడు బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవు. నీళ్లు నింపితే కానీ భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.  

విజిలెన్స్​ నివేదికపై చర్చ జరిగితే బండారం బయటపడుతుంది..

డిసెంబర్ 1..2023 లో స్మితా సబర్వాల్ ఏం రాశారు. మీ దగ్గర ఇరిగేషన్ సెక్రెటరీ గా పని చేసిన ఆమె రాసిన లేఖ బయట పెట్టినం కదా. మేడిగడ్డ అందరం కలిసి పోదాం అని అడిగిన. మీరు రాలేదు. మీకు వీలైన టైం చెప్పండి అని కూడా చెప్పినం అయినా రాలేదు..’ అని రేవంత్‌ అన్నారు. ఎన్నికల ముందు ఇష్యూ అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారు. విజిలెన్స్ నివేదికపై చర్చ జరిగితే బండారం బయట పడుతుంది అని కేసీఆర్.. krmb పేరుతో సభ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ మీద ఎదురు దాడి చేసిండు. సుద్దాపుస మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్. చావు నోట్లో తలకాయ పెట్టినోడివి అయితే..అసెంబ్లీ లో అడుగు ఎందుకు పెట్టడం లేదు. .మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు. మూడు బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవు. నీళ్లు నింపితే కానీ భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి.  

అసెంబ్లీకి రాలేని కేసీఆర్​ నల్లగొండకు ఎలా వెళ్లారు

ప్రజల ముందు తన బండారం బయటపడుతుందనే నల్లగొండలో కేసీఆర్ సభలో మాపై ఎదురుదాడికి దిగారని సీఎం కేసీఆర్​ అన్నారు.  మీరు చేసిన నిర్వాకంపై సభలో ఆధారాలతో సహా బయటపెట్టామంటూ..  మేడిగడ్డ సందర్శనకు రావాలని మా మంత్రి  లేఖ రాశారని అన్నారు. మీకు తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళదామని చెప్పాం..కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్.. నల్లగొండ సభకు ఎలా వెళ్లారు..నల్లగొండ దూరమా? అసెంబ్లీ దూరమా?... కేసీఆర్​ప్రభుత్వంచేసిన లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలైపోయిందన్నారు. మేడిగడ్డ ఇష్యూను చులకన చేసి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం.... KRMB పై తాను సలహాలు ఇచ్చేవాడినని కేసీఆర్ అంటున్నారు. సభకు వచ్చి సలహాలు ఇవ్వొచ్చని మేం ముందునుంచీ చెబుతున్నాం.. తీర్మానంలో లోపాలు ఉంటే హరీష్ రావు ఎలా మద్దతు ఇచ్చారు.. అందుకే వారి మాటలకు విలువ లేదని కేసీఆర్ సభకు రావాలని మేం కోరాం..

కేసీఆర్​... ఎన్నికల ముందే తెలిస్తే  ప్రతిపక్ష హోదా వచ్చేది కాదు..

నల్లగొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడటం కాదు.. శాసనసభకు రండి.. కేసీఆర్ మమ్మల్ని వెంటాడుతాం.. అంటూ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు...కాళేశ్వరంపై చర్చకు రావడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు..  మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ మాట్లాడుతున్నారు...నీ గురించి ప్రజలకు ముందే తెలిసి ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదు..  కేసీఆర్ ను ఈ వేదికగా ఆహ్వానిస్తున్నా...రేపు ఉదయం సభకు రండి... బడ్జెట్ తో పాటు, సాగునీటి రంగంపై చర్చలో పాల్గొనండి.. కుర్చీ పోయిందనే.. కుర్చీని వెతుక్కుంటూ నల్లగొండ పోయిండు..

అన్ని పాపాలకు కారణం కేసీఆరే..

మెడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు స్పష్టంగా కమిపిస్తున్నా.. చిన్న సంఘటనగా కేసీఆర్ చెబుతున్నారు... చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతితో ఓట్లు పొందాలని కేసీఆర్  ఎత్తుగడ...భయపడనని ప్రగల్భాలు పలకడం కాదు... వచ్చి సభలో మాట్లాడు..కాళేశ్వరం అవినీతి చర్చకు రాకుండా ఉండేందుకే నల్లగొండలో కేసీఆర్ సభ పెట్టుకున్నారు...కేసీఆర్ కాళేశ్వరానికి కాదు..ఇక కాశీకి వెళ్లి సన్యాసం పుచ్చుకోవాల్సిందే....బీజేపీ వైఖరేంటో ఇప్పటికైనా స్పష్టంచేయాలి..కేసీఆర్ అవినీతికి సహకరిస్తారో... అవినీతిపై విచారణ చేసే మా ప్రభుత్వానికి సహకరిస్తారో చెప్పాలి..కేసీఆర్ అవినీతిని బయటపెట్టడానికి ఈ పర్యటన కీలకం..అలాంటి మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.