ఐకియా సమీపంలో చెత్త డంపింగ్..పీఎస్లో కేసు పెట్టిన సీఎంసీ

ఐకియా సమీపంలో  చెత్త డంపింగ్..పీఎస్లో కేసు పెట్టిన సీఎంసీ
  •      వాహనాల స్వాధీనం  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐకియా సమీపంలో అక్రమంగా చెత్త, నిర్మాణ వ్యర్థాలు(సీ అండ్ డీ వేస్ట్) డంపింగ్ చేస్తున్న వారిపై శుక్రవారం రాయదుర్గం పీఎస్​లో సీఎంసీ కేసు పెట్టింది. అలాగే, డంపింగ్‌‌‌‌కు వినియోగించిన వాహనాలను స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతంలో మళ్లీ చెత్త వేయకుండా డంపింగ్ స్థలాన్ని పూర్తిగా బ్లూ జీఐ షీట్లతో మూసివేసింది.