పీఆర్పీ చెల్లించే వరకు పోరాడుతం :  సీఎంఓఏఐ సింగరేణి అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్

పీఆర్పీ చెల్లించే వరకు పోరాడుతం :  సీఎంఓఏఐ సింగరేణి అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌పీ(పర్ఫామెన్స్​ రిలేటెడ్​ పే) బకాయిల చెల్లింపునకు పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి శాఖ అధ్యక్షుడు టి.లక్ష్మీపతి గౌడ్ తెలిపారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సీఎంఓఏఐ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి అధికారుల రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు.

ఇప్పటికే కంపెనీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి పీఆర్‌‌‌‌పీ బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పే అప్‌‌‌‌గ్రేడేషన్ అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఎంఓఏఐ నేతలు వెంకటాచారి, కె.మాలతి, టి.వీరన్న, ఎం.రాంబాబు, కె.సర్వేశ్వర్ రావు, కమలాకర్, హరిప్రసాద్ దీక్షలో కూర్చున్నారు. సింగరేణి అధికారుల ఆందోళనలకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంఘీభావం తెలిపారు. ఆయన వెంట కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, యూనియన్ నేతలు వంగా వెంకట్, గట్టయ్య, కిష్టఫర్ పాల్గొన్నారు.