హైదరాబాద్ సిటీ, వెలుగు: హిందూ ధర్మాచార్యులు, సాధు సంతులతో గద్వాల్, మల్దకల్ పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ, సాధు పరిషత్ప్రతినిధులు గురువారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. శంకర్ స్వామితో అమర్యాదకర ప్రవర్తన హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు.
గద్వాల్ ఎస్‌ఐ, మల్దకల్ ఎస్‌ఐలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. విశ్వహిందూ పరిషత్ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ హిందూ స్వామీజీలను అవమానించే విధంగా పోలీసులు వ్యవహరించడం శోచనీయమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
