చెప్పులతో కొట్టించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి..

చెప్పులతో కొట్టించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి..

రాజకీయ నేతల లక్ష్యం ఒక్కటే ఉంటుంది.. అది గెలుపు.. ఏం చేసైనా.. ఎలాగైనా గెలిచి తీరాలి.. స్నానాలు చేయిస్తారు.. ముడ్లు కడుగుతారు.. అన్నం తినిపిస్తారు.. వంట వండుతారు.. ఎన్ని జిమ్మిక్కులు అయినా చేస్తారు.. ఇక సెంటిమెంట్ల విషయంలో అయితే వీళ్లకు తిరుగేలేదు.. ఆ సెంటిమెంట్ ఫాలో అయితే గెలుస్తాం అంటే చాలు.. ఎందాకైనా వెళతారు.. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో జరిగింది. 

నవంబర్ 17వ శుక్రవారం మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే రత్లాం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చెప్పులతో కొట్టించుకున్నాడు. స్థానికంగా ఫకీర్ బాబా అనే వ్యక్తి ఉన్నాడు. అతను చెప్పులతో కొడుతుంటాడు.. అతను చెప్పులతో కొడితే మంచి జరుగుతుందని.. విజయం వరిస్తుందని స్థానికంగా చాలా మంది విశ్వాసం. దీనికి కాంగ్రెస్ అభ్యర్థి పరాస్ సాక్లేచ్ ఏ మాత్రం తీసిపోలేదు.. జనం సెంటిమెంట్ ను ఓట్ల రూపంలో మార్చుకోవటానికి.. నవంబర్ 17వ తేదీ ఉదయమే.. రోడ్డు పక్కన ఉండే ఫకీర్ బాబా దగ్గరకు వచ్చారు. 

కొత్తగా కొనుగోలు చేసిన చెప్పుల జతను ఫకీర్ బాబాకు ఇచ్చాడు కాంగ్రెస్ అభ్యర్థి పరాస్ సాక్లేచ్. ఆ చెప్పులను తీసుకున్న ఫకీర్ బాబు.. కాంగ్రెస్ అభ్యర్థి పరాస్ నెత్తిన కొడతాడు.. చెప్పులతో చెంపలపై కొడతాడు.. చేతలపై కొడతారు.. ఓవరాల్ గా ఓ 10 చెప్పు దెబ్బలు అయితే తిన్నాడు.. ఫకీర్ బాబా  చెప్పులతో కొడుతుంటే.. ఎంతో ఆనందంగా.. నవ్వుతూ కొట్టించుకోవటం విశేషం.. 

మొత్తానికి ఎన్నికల్లో విజయం సాధించటం కోసం.. గెలుపు కోసం.. ప్రజల సెంటిమెంట్ ను ఫాలో అయ్యి.. చెప్పు దెబ్బలు తిన్నాడు కాంగ్రెస్ అభ్యర్థి..  జనం ఎటూ కొట్టలేరు.. కనీసం ఫకీర్ బాబా అయినా కొట్టాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తం ఈ చెప్పుదెబ్బలతో ఓట్లు రాలతాయా.. పరాస్ గెలుస్తాడా అనేది డిసెంబర్ 3వ తేదీ వరకు వెయిట్ అండ్ సీ..