మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదం ఎత్తుకున్న హస్తం పార్టీ

మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదం ఎత్తుకున్న హస్తం పార్టీ

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ గ్రౌండ్ లెవల్ నుంచి వ్యూహరచన చేస్తోంది. మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదాన్ని ఎత్తుకుని ముందుకెళ్తుంది.గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు మునుగోడుకెళ్లాలని హస్తం పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 13 నుంచి 30 వరకు నేతలు మునుగోడులో పర్యటించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరల పెంపుపైనే ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రధానంగా బీజేపీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే టార్గెట్ గా చేస్తూ ప్రచారం చేయాలని నిర్ణయించారు.

కులాలు, వృత్తుల వారీగా అనుబంధ సంఘాలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. అమిత్ షా సభకు పోటీగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి మునుగోడులో అభ్యర్థి ఎంపికను పక్కకు పెట్టిన టీపీసీసీ...ఇప్పటికిప్పుడే అభ్యర్థిని ఫైనల్ చేస్తే మరింత నష్టం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశావహులను కూడా మునుగోడులో ప్రచారం చేయాలని ఏఐసీసీ, పీసీసీ నేతలు సూచించారు.