హైదరాబాద్, వెలుగు: ఓటర్ల సమగ్ర సవరణ జాబి తా (సర్)పై కాంగ్రెస్ ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్త లను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమైంది. బూత్ స్థాయి ఏజెంట్లకు (బీఎల్‌ఏ) శిక్షణ ఇవ్వడానికి పార్టీ లోని రాష్ట్ర స్థాయి నేతలను టీవోటీలుగా (ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్) 74 మందిని నియిమించింది.
వారి తో శనివారం గాంధీ భవన్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సమావేశమయ్యారు. బీఎల్ఏలకు ‘సర్’ పై ఇవ్వాల్సిన శిక్షణ గురించి టీవోటీలకు సావంత్ వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో లౌకికవాద ఓట్లు, పార్టీ సానుభూతి ఓట్లను బూత్ స్థాయిలో తొలగించకుండా చూడాల్సిన తీరుపై వివరించారు. టీవోటీలు త్వరలోనే ఆయా జిల్లాలకు వెళ్లి బీఎల్‌ఏలతో సమావేశమై 'సర్' పై శిక్షణ ఇవ్వనున్నారు.
