నల్గొండలో 12 సీట్లు కాంగ్రెస్ కు రిజర్వ్ అయినయ్:కోమటిరెడ్డి

నల్గొండలో 12 సీట్లు కాంగ్రెస్ కు రిజర్వ్  అయినయ్:కోమటిరెడ్డి

రాబోయే రెండు మూడు నెలలు ప్రజల్లోనే ఉండేలా  బస్సుయాత్ర తరహాలో  చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ పై చర్చిస్తామన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో   ఇంతకు ముందు ఒక లెక్క..ఇపుడు ఒక లెక్కా అని అన్నారు. నేతల్లో ఏమైనా అభిప్రాయ భేదాలున్నా కలిసిపోతామన్నారు.

 తాను సబ్ స్టేషన్లలో   రికార్డులు తీయడం వల్లే రాష్ట్రంలో  ఇపుడు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తనకు బీఆర్ఎస్ నేతల నుంచి కూడా తనకు ఫోన్లు వస్తున్నాయన్నారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  భేటీ  పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్  నేతలు  స్పీడ్ పెంచారు.   కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీప్  రేవంత్,  వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి ఇంకా పలువురు ముఖ్య నేతలు కాసేపట్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంట్లో భేటీ కానున్నారు.  ఎన్నికలకు రోడ్ మ్యాప్, వ్యూహాలపై చర్చించనున్నారు.