చాలా పార్టీల నుంచి ఆఫర్లొస్తున్నయ్.. అయినా వెళ్లను

చాలా పార్టీల నుంచి ఆఫర్లొస్తున్నయ్.. అయినా వెళ్లను

భువనగిరి: టీపీసీసీ చీఫ్ పదవి తనకు దక్కకపోవడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సీనియర్ నాయకుడిగా అన్ని అర్హతలు ఉన్నా ఆశించిన పదవి దక్కకపోతే బాధగా ఉంటుందని వెంకట్‌రెడ్డి అన్నారు. అంతమాత్రాన తాను పార్టీ మారతానని అనుకోవద్దన్నారు. చాలా పార్టీల నుంచి తనకు ఆఫర్లు వచ్చాయని, అయినా వెళ్లలేదన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, గతంలో మంత్రి పదవిని తాను వదులుకున్నానని గుర్తు చేశారు. పార్టీలు మారాల్సిన, గ్రూపులు కట్టాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. మోసాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాల్సిన అవసరం కూడా లేదని.. తనకు తెలిసిందల్లా కార్యకర్తలకు అండగా ఉండటమేనన్నారు. ‘రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో, నేను భువనగిరిలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించలేక పోయాం. గాంధీ భవన్‌‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవడం కష్టం. ప్రజలతో మమేకమై గ్రూప్ లేకుండా పని చేసినప్పుడే గెలుస్తాం. నూతన బాధ్యతలు స్వీకరించిన వాళ్లు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలతో మమేకం కావాలి’ అని కోమటిరెడ్డి సూచించారు.