టి.కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు

టి.కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు
  • మాణిక్కం ఠాగూర్ చైర్మన్ గా కమిటీ
  • కమిటీలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు చోటు

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ పై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ.. పార్టీ పూర్వ వైభవం కోసం మళ్లీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యులను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ ఖరారు చేశారు. కమిటీ సభ్యుల పేర్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. కొత్త కమిటీ వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. మాణిక్కం ఠాగూర్ ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో పార్టీ పట్ల అసంతృప్తితో అలకబూనిన కోమటిరెడ్డి సోదరులకు చోటు కల్పించడం విశేషం. 
కమిటీలో వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అందరితోపాటు ఏఐసీసీ ఆమోదించిన కమిటీల ఛైర్మన్లు, తెలంగాణ నుండి ఏఐసీసీ కార్యదర్శులందరూ, తెలంగాణ AICC ఇంచార్జ్‌ కార్యదర్శులు కమిటీలో ఉంటారు. మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ఛైర్మన్ గా, మహమ్మద్ షబ్బీర్ అలీ కన్వీనర్‌గా వ్యవహరించే కమిటీలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వి. హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, కె. జానా రెడ్డి, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టి. జీవన్ రెడ్డి, రేణుకా చౌదరి, పి. బలరాం నాయక్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు, పొద్దెం వీరయ్య, అనసూయ (సీతక్క), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.