11న పెట్రోల్ బంకుల ముందు నిరసన

11న పెట్రోల్ బంకుల ముందు నిరసన

పెరుగుతున్న పెట్రోల్ రేట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 11న పెట్రోల్ బంకుల ముందు ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా లీడర్లంతా.... నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు అధినేత్రి సోనియాగాంధీ. పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలు పెరుగుతుండటంతో ట్రాన్స్ పోర్టేషన్ ఛార్జీలు పెరిగి నిత్యావసరాల రేట్లు భారీగా పెరుగుతున్నాయన్నారు. సామాన్యులు బతకడమే కష్టంగా ఉందంటే కేంద్రం వారిపై కక్ష కట్టిందని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. పెరుగుతున్న పెట్రోల్ రేట్లను నిరసిస్తూ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నారు. కేరళ పెట్రోల్ బంకుల ముందు నిరనస తెలిపారు కాంగ్రెస్ లీడర్లు.