హైదరాబాద్ లో కూల్ వెదర్

హైదరాబాద్ లో కూల్ వెదర్

హైదరాబాద్ సిటీలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. కూల్ వెదర్ వచ్చేసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండ తీవ్రత అధికంగా ఉన్నా.. ఆ వెంటనే మేఘాలు కమ్మేశాయి. చల్లటి వాతావరణ ఏర్పడింది. సిటీలో అక్కడక్కడ చిరు జల్లులు పడుతున్నాయి. సిటీ శివార్లలో కొన్ని చోట్ల వర్షం పడుతుంది. ఉక్కబోతతో అల్లాడిన జనం.. రిలాక్స్ అయ్యారు. మేఘాలు కమ్మేయటంతో సాయంత్రం అయ్యిందా అనే ఫీలింగ్ ఏర్పడింది వాహనదారులకు.

15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో ఈ వర్షాలు ఉంటాయని స్పష్టం చేసింది. వాతావరణ శాఖ చెప్పినట్లే.. మార్చి 16వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ సిటీలో వాతావరణ మారిపోయింది. ఎండపోయి.. చల్లటి గాలులు వీస్తున్నాయి. కూల్ వెదర్ వచ్చింది. నిన్నటి వరకు ఎండలతో ఇబ్బంది పడిన జనం.. ఇప్పుడు కూల్ వెదర్ కొంత ఉపశమనం పొందుతున్నారు.