తెలంగాణలో సెప్టెంబర్ చివరికల్లా కరోనా ఉండదు: శ్రీనివాసరావు

తెలంగాణలో సెప్టెంబర్ చివరికల్లా కరోనా ఉండదు: శ్రీనివాసరావు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతోందన్నారు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు. నెలాఖరుకు నగరంలో కేసులు చాలా తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు సెప్టెంబర్‌ చివరికి తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారు. శనివారం(ఆగస్టు-8)  మీడియీతో మాట్లాడిన ఆయన…కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కేటాయించిదని గుర్తు  చేశారు. కరోనా రెండు వారాలు మాత్రమే ఉండే జబ్బు అని… 11వందల సెంటర్స్‌లో రోజుకు 23వేల మందికి టెస్టులు చేస్తున్నామన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే హోం ఐసోలేషన్ కిట్ ఇస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్స్ ద్వారా హోం ఐసోలేషన్ రోగులను మానిటరింగ్ చేస్తున్నామన్నారు.

కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను  బేఖాతరు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు శ్రీనివాసరావు. ఇప్పటి వరకు దాదాపు 1039 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 130కి పైగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇన్యూరెన్స్‌కు సంబంధించి 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఆస్పత్రలన్నింటికి కౌన్సిలింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రులను మూసివేడం తమ ఉద్ధేశ్యం కాదని స్పష్టం చేశారు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 150 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అందులో ప్రస్తుతం 91  ఆస్పత్రుల్లో చికిత్సలు జరుగుతున్నారు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు. మరిన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులలో కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.