డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్..50 కిలోల గంజాయి పట్టివేత

డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్..50 కిలోల గంజాయి పట్టివేత

శంషాబాద్ వద్ద డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు గంజాయినీ పట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా, మద్యం తాగి కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు.

అనంతరం అతని కారులో తనిఖీలు చేయగా,అందులో 50 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పారిపోయినట్టు తెలిపారు. గంజాయి ఎక్కడినుండి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై విచారణ జరుపుతున్నట్టు సీఐ బాలరాజు తెలిపారు.